కుబీర్‌ మండలంలో మళ్లీ విస్తరిస్తున్న గుడుంబా, పల్లెలు మత్తులో

కుబీర్ గుడుంబా: నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో గుడుంబా మళ్లీ విస్తరిస్తోంది. ఒకప్పుడు వేలాది కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా దెబ్బతీసిన గుడుంబా ఇప్పుడు ప్యాకెట్ల రూపంలో గ్రామాల్లో అందుబాటులోకి రావడంతో పల్లెలు మత్తులో మునిగిపోతున్నాయి. మండలంలోని పలు గ్రామాలకు సమీపంలోని సరిహద్దు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా తయారు చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలపై మండలంలోని పలు గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ గుడుంబా వ్యాపారం విస్తరిస్తోందనే ఆందోళన.

కుబీర్ గుడుంబా, NewzFast Telugu (నిర్మల్ జిల్లా, కుబీర్): నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో గుడుంబా మళ్లీ విస్తరిస్తోంది. ఒకప్పుడు వేలాది కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా దెబ్బతీసిన గుడుంబా ఇప్పుడు ప్యాకెట్ల రూపంలో గ్రామాల్లో అందుబాటులోకి రావడంతో పల్లెలు మత్తులో మునిగిపోతున్నాయి.

మండలంలోని పలు గ్రామాలకు సమీపంలోని సరిహద్దు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా తయారు చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలపై మండలంలోని పలు గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ గుడుంబా వ్యాపారం విస్తరిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

గ్రామ శివార్లలో గుట్టుచప్పుడు కాకుండా బట్టీలు ఏర్పాటు చేసి, కలుషిత నీటిని మరగబెట్టి, కుళ్లిన పండ్లు, కూరగాయలు, బెల్లం, చక్కెర, పటిక తదితర పదార్థాలతో గుడుంబా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం పాల ప్యాకెట్ల మాదిరిగా ప్లాస్టిక్ కవర్లలో నింపి గ్రామాలకు తరలిస్తున్నారు.

రోజంతా కూలీ పనులు ముగించుకుని వచ్చిన నిరుపేదలు తక్కువ ధరకే లభిస్తుందనే కారణంతో దీనిని సేవిస్తూ తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు.

గుడుంబాను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ నిఘా పూర్తిగా సడలిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బెల్లం, పటిక వంటి ముడిసరుకులపై నియంత్రణ విధించి, తయారీదారులకు కౌన్సెలింగ్, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం ద్వారా గుడుంబాను అదుపులోకి తీసుకువచ్చిన అధికారులు, ప్రస్తుతం అదే చొరవ చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

మండలంలోని తండాల నుంచి గుడుంబాను గ్రామాలకు తరలిస్తున్నట్లు సమాచారం.

గతంలో కొంతమందిని పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేసినప్పటికీ, వ్యాపారం మాత్రం ఆగలేదని స్థానికులు చెబుతున్నారు. తయారీ కేంద్రాలపై కాకుండా అప్పుడప్పుడు తండాలపై మాత్రమే దాడులు చేయడం వల్ల అసలు మూలాలను గుర్తించలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.

వ్యవసాయ పనుల సీజన్‌ను ఆసరాగా చేసుకుని పంట చేల వద్ద రహస్యంగా తయారీ కొనసాగుతోందని చెబుతున్నారు.

నడిరోడ్డుపై ద్విచక్ర వాహనాలపై గుడుంబా తరలిస్తున్నా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముడిసరుకుల సరఫరాను అడ్డుకోవడంతో పాటు తయారీ కేంద్రాలను గుర్తించి ధ్వంసం చేయాలని, తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వారికి కౌన్సెలింగ్ నిర్వహించి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, గ్రామాల్లో గుడుంబా దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు