కోనరావుపేటలో దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరం

కోనరావుపేట దివ్యాంగ విద్యార్థుల వైద్య శిబిరం: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశాల మేరకు కోనరావుపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మానసిక దివ్యాంగులు, వికలాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి వారి శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితులను వైద్య బృందం సమగ్రంగా పరిశీలించింది. చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటరమణ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. సైకాలజిస్ట్ డాక్టర్ అనూష.

కోనరావుపేటలో దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరం, NewzFast Telugu (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశాల మేరకు కోనరావుపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మానసిక దివ్యాంగులు, వికలాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ శిబిరంలో విద్యార్థులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి వారి శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితులను వైద్య బృందం సమగ్రంగా పరిశీలించింది. చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటరమణ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు.

సైకాలజిస్ట్ డాక్టర్ అనూష విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి, అవసరమైన కౌన్సెలింగ్‌తో పాటు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ, మానసిక దివ్యాంగులైన పిల్లల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వారికి అవసరమైన వైద్య సేవలు, చికిత్సలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గుర్తించిన ఆరోగ్య సమస్యలకు తగిన వైద్యం అందించడంతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాశీరాం, ఎంపీడీవో స్నిగ్ధారెడ్డి, డాక్టర్ వెంకటరమణ, సైకాలజిస్ట్ డాక్టర్ అనూష, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సంపత్ కుమార్, వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు