కొక్కొరొకో, NewzFast Telugu: యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ, కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్.వి ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై తొలి చిత్రంగా ‘కొక్కొరొకో’ రూపొందుతోంది.
ఐదు విభిన్న పాత్రలతో తెరకెక్కుతున్న ఈ ఆంథాలజీ ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ఒక ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా వెల్లడించారు.
అదే సమయంలో సినిమాపై ఆసక్తిని పెంచుతూ ఒక అందమైన గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ గ్లింప్స్‌లో శీను, పార్వతి ప్రేమకథను చూపించారు. పార్వతి శీను కోసం ఎదురుచూస్తుండగా, ఆమెను సర్ప్రైజ్ చేయడానికి అతను చెరువులో నుంచి పూలు సేకరించి తీసుకొస్తుంటాడు.
ఇలాంటి చిన్న సంఘటనల ద్వారా వారి మధ్య అమాయకమైన ప్రేమను అందంగా ఆవిష్కరించారు.
నటీనటుల సహజమైన నటన, శీను-పార్వతి మధ్య కెమిస్ట్రీ ఈ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందమైన విజువల్స్, భావోద్వేగభరితమైన సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
శ్రీనివాస్ వసంతాల కథ చెప్పే విధానంపై నమ్మకంతోనే రమేష్ వర్మ ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
ఈ చిత్రానికి ప్రముఖ గాయకుడు జీవీ సాగర్ మాటలు అందిస్తున్నారు. సీనియర్ రచయిత జి.
సత్యమూర్తి తనయుడైన ఆయన, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు సోదరుడు. ‘రాక్షసుడు’ తర్వాత ఆయన డైలాగ్ రైటర్‌గా చేస్తున్న రెండో చిత్రం ఇది.
ఆకాష్ ఆర్. జోషి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, లండన్‌కు చెందిన సంకీర్తన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
డా. జయంతి లాల్ సమర్పణలో పెన్ స్టూడియోస్, ఆర్.వి.స్టూడియోస్ బ్యానర్లపై రేఖా వర్మ, కూరపాటి శిరీష నిర్మిస్తుండగా, నీలాద్రి ప్రొడక్షన్ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది.
రమేష్ వర్మ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.




