కింగ్ 100 మూవీ, NewzFast Telugu: అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంగా ‘కింగ్ 100’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై రా కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో టబు ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఆమె పోషిస్తున్న మహంతి ఝాన్సీరాణి పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేశారు.
టబు పవర్‌ఫుల్ వాయిస్‌ఓవర్‌తో సాగిన ఈ గ్లింప్స్‌లో, ‘లక్‌ను నమ్మేవాళ్లు, హార్డ్ వర్క్‌ను నమ్మేవాళ్లు’ అనే సంభాషణతో ఆమె పాత్ర స్వభావం ఆవిష్కరించబడింది. భారీ జనసమూహం ముందు ఆమె ప్రవేశం, ప్రమాణస్వీకారం వంటి సన్నివేశాలు ఆసక్తిని పెంచాయి.
ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలను రాజా మహదేవన్ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.


