Kids AI Knowledge & Thinking Competition, NewzFast Telugu (Metro Atlanta, USA): భవిష్యత్ తరాలు సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందాలని, కృత్రిమ మేధస్సు (AI)లో మంచి నైపుణ్యం సాధించాలని తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక కొత్త కార్యక్రమాన్ని సంకల్పించింది. “Kids AI Knowledge & Thinking Competition” పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
వచ్చేది సాంకేతిక యుగమని, పిల్లలను చిన్నతనం నుంచే సాంకేతికంగా పరిపుష్టం చేయాలని, కనీస అవగాహన అయినా కల్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ పోటీ ప్రత్యేకంగా AI పై అవగాహన పెంపొందించేందుకు రూపొందించబడింది.
ఇందులో పాల్గొనడానికి ఎలాంటి కోడింగ్ లేదా ల్యాప్టాప్ అవసరం లేదు. కేవలం ఆలోచనా శక్తి, ఒక పెన్సిల్ ఉంటే సరిపోతుంది.
ఈ పోటీలు రెండు విభాగాలుగా నిర్వహించబడతాయి. జూనియర్ క్విజ్ 9 నుండి 13 సంవత్సరాల పిల్లల కోసం, సీనియర్ క్విజ్ 14 నుండి 16 సంవత్సరాల పిల్లల కోసం.
కేవలం 45 నిమిషాల పాటు జరిగే ఈ విజ్ఞాన పోటీ ద్వారా పిల్లల్లో టెక్నాలజీపై సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యం.
ప్రతి విభాగంలోనూ ప్రతిభ కనబరిచిన వారికి ఆకర్షణీయమైన ట్రోఫీలతో పాటు విలువైన ట్రైనింగ్ కూపన్లు అందజేయనున్నారు. బహుమతులు అదే రోజు ప్రదానం చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
ఛాంపియన్ (మొదటి స్థానం) $500 ట్రైనింగ్ కూపన్, రన్నరప్ (రెండో స్థానం) $400 ట్రైనింగ్ కూపన్, మూడో స్థానం $300 ట్రైనింగ్ కూపన్ పొందుతారు.
ఈ పోటీలో ప్రధానంగా AI ఎలా పనిచేస్తుంది, నిజ జీవితంలో AI వినియోగం, భద్రత మరియు బాధ్యత, లాజికల్ థింకింగ్, ప్రాంప్ట్ డిజైన్ మరియు సృజనాత్మకత అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.




