ఖాజాగూడ భూదోపిడీలో పెద్దల హస్తం ఉందని దాసోజు శ్రవణ్ ఆరోపణ

ఖాజాగూడ భూదోపిడీ: శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని సర్వేనంబర్ 20/1లోని 3.17 ఎకరాల భూదోపిడీ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. వెయ్యి కోట్ల విలువైన బీసీ స్టడీ సర్కిల్ స్థలాన్ని సాస్ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టి రేవంత్ ప్రభుత్వం చారిత్రక ద్రోహం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బుధవారం బీఆర్‌ఎస్ నేత కురువ విజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2020 జనవరి 13న రాసిన లేఖలో సాస్ సంస్థ అనధికారికంగా ఆక్రమించిందనే.

ఖాజాగూడ భూదోపిడీ, NewzFast Telugu (హైదరాబాద్, తెలంగాణ): శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని సర్వేనంబర్ 20/1లోని 3.17 ఎకరాల భూదోపిడీ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. వెయ్యి కోట్ల విలువైన బీసీ స్టడీ సర్కిల్ స్థలాన్ని సాస్ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టి రేవంత్ ప్రభుత్వం చారిత్రక ద్రోహం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.

హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బుధవారం బీఆర్‌ఎస్ నేత కురువ విజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2020 జనవరి 13న రాసిన లేఖలో సాస్ సంస్థ అనధికారికంగా ఆక్రమించిందనే కారణంతో 1.93 కోట్ల జరిమానా విధించి ఖాళీ చేయించారని ఆయన గుర్తుచేశారు.

నారాయణరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు 2025 నవంబర్ 1న ఈ భూమిని 22-ఏలో చేర్చారని చెప్పారు. కానీ ప్రభుత్వ పెద్దల అండతో టైటిల్ వెరిఫికేషన్ లేకుండా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైడ్రా పరిధిలో అనుమతులిచ్చి హైరైజ్డ్ భవన నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు.

ఈ భూ దోపిడీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సీఎస్, సీసీఎల్‌ఏ, హైడ్రాకు లేఖలు రాసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు.

అలాగే గచ్చిబౌలిలో లిడ్‌క్యాప్ (టీజీ లిప్‌కో)కు చెందిన ఆరెకరాలకు పైగా, సుమారు 6 వేల కోట్ల విలువైన భూమిని అపర్ణ, వంశీరామ్ బిల్డర్స్‌కు కట్టబెట్టారని దాసోజు ఆరోపించారు. ఏక్తా మాల్ పేరిట మొదట ఎకరం తీసుకుని, తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా మార్చడానికి మిగతా భూమిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆయన దుయ్యబట్టారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు