హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్ల లైసెన్సులు సస్పెండ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

కేఎఫ్‌సీ డొమినోస్ లైసెన్సులు సస్పెండ్: బ్రాండెడ్ ఫుడ్ చైన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్ (క్యూర్ రీజియన్) పరిధిలోని 26 కేఎఫ్‌సీ, డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్లపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గురువారం మెరుపు దాడులు నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో కూడిన 13 ప్రత్యేక బృందాలు చేపట్టిన ఈ తనిఖీల్లో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. దీంతో ఎనిమిది కేఎఫ్‌సీ, ఒక డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్ల.

కేఎఫ్‌సీ డొమినోస్ లైసెన్సులు సస్పెండ్, NewzFast Telugu (హైదరాబాద్): బ్రాండెడ్ ఫుడ్ చైన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్ (క్యూర్ రీజియన్) పరిధిలోని 26 కేఎఫ్‌సీ, డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్లపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గురువారం మెరుపు దాడులు నిర్వహించింది.

ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో కూడిన 13 ప్రత్యేక బృందాలు చేపట్టిన ఈ తనిఖీల్లో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. దీంతో ఎనిమిది కేఎఫ్‌సీ, ఒక డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేసి, వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.

తనిఖీల్లో పలు స్టోర్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. ఒకసారి వాడిన వంట నూనెను ఫిల్టర్ చేసి మళ్లీ వాడేందుకు అనధికారికంగా ‘మెగ్నీషియం సిలికేట్’ ఉపయోగిస్తున్నట్లు బయటపడింది.

పలు చోట్ల కిచెన్లు, స్టోర్ రూమ్‌లలో దుర్వాసన, ఈగలు, బొద్దింకలు, ఎలుకల విసర్జనలు, గోడలపై ఫంగస్ కనిపించాయి.

గడువు తీరిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, వంట సిబ్బంది హెయిర్ నెట్‌లు, ఆప్రాన్లు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలను కూడా అధికారులు నమోదు చేశారు. కల్తీ అనుమానంతో 20 ఆహార శాంపిల్స్ సేకరించగా, సుమారు 52 కిలోల సింథటిక్ మెగ్నీషియం సిలికేట్‌ను సీజ్ చేశారు.

లైసెన్సులు సస్పెండ్ అయిన తొమ్మిది అవుట్‌లెట్లలో మదీనాగూడ, మియాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, చార్మినార్, మూసారాంబాగ్, బంజారాహిల్స్, శిల్పకళా వేదిక (హైటెక్ సిటీ), ఇనార్బిట్ మాల్ (మాదాపూర్) ప్రాంతాల్లోని స్టోర్లు ఉన్నాయి. కిచెన్లలో నీరు కారడం, తుప్పు పట్టిన చిల్లర్ రూమ్‌లు, అపరిశుభ్రమైన వంట పాత్రలు, బొద్దింకల బెడద వంటి అంశాలు వీటిలో గుర్తించారు.

తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన కార్ఖానా, గచ్చిబౌలి, హైటెక్ సిటీ డొమినోస్ బ్రాంచీలు, నిజాంపేట, గచ్చిబౌలి కేఎఫ్‌సీ బ్రాంచీలకు జరిమానాల కోసం షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఎనిమిది స్టోర్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చి, త్వరలో మళ్లీ తనిఖీలు చేపట్టనున్నారు.

లైసెన్సులు సస్పెండ్ అయిన తొమ్మిది స్టోర్లను తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తక్షణమే తొలగించాలని (డీలిస్ట్) స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు వివరాలు పంపనున్నట్లు టీజీ సేఫ్ కమిషనర్ ప్రకటనలో తెలిపారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు