కల్వర్టును ఢీకొని వ్యక్తి మృతి, NewzFast Telugu (కథలాపూర్, తెలంగాణ): బైక్పై ఇంటికి వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఆయన కల్వర్టు కింద పడిపోయాడు.
ఈ ఘటనలో మృతదేహం ఎవరికీ కనిపించకపోవడంతో రెండు రోజుల పాటు ప్రమాదం వెలుగులోకి రాలేదు. చివరకు కల్వర్టు వద్ద బైక్ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది.
కథలాపూర్ గ్రామ శివారులోని గుంటు పెరుమాండ్ల సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భూషణ్రావుపేట గ్రామానికి చెందిన తెడ్డు లక్ష్మన్ (50) బుధవారం సాయంత్రం పనులు ముగించుకుని రాత్రి 8:30 గంటల సమయంలో హీరో హోండా బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు.
ఈ క్రమంలో గుంటు పెరుమాండ్ల సమీపంలో బైక్ అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది.
దీంతో లక్ష్మన్ కల్వర్టు కింద పడిపోయాడు. కల్వర్టు కింద ఉండటంతో అటుగా వెళ్లేవారికి ప్రమాదం జరిగిన విషయం తెలియలేదు.
మరోవైపు లక్ష్మన్ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కల్వర్టు వద్ద బైక్ పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై రవికిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో భూషణ్రావుపేటలో విషాదం నెలకొంది.




