రేపు సిద్దిపేటలో కల్వకుంట్ల కవిత పర్యటన, పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన

కల్వకుంట్ల కవిత సిద్దిపేట పర్యటన: తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత రేపు (నవంబర్ 13, 2026) మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి (తెలంగాణ అమరవీరుల స్తూపం) చౌరస్తాలో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ తర్వాత సిద్దిపేటలో పార్టీ ఆఫీస్ నిర్మిస్తున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. పార్టీ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం.

కల్వకుంట్ల కవిత సిద్దిపేట పర్యటన, NewzFast Telugu (సిద్దిపేట, తెలంగాణ): తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత రేపు (నవంబర్ 13, 2026) మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి (తెలంగాణ అమరవీరుల స్తూపం) చౌరస్తాలో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేయనున్నారు.

హైదరాబాద్, నిజామాబాద్ తర్వాత సిద్దిపేటలో పార్టీ ఆఫీస్ నిర్మిస్తున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

పార్టీ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడనున్నారు.

శుక్రవారం ఉదయం 7 గంటలకు బంజారాహిల్స్ లోని నివాసం నుంచి కవిత బయల్దేరుతారు. ఉదయం 9 గంటలకు సిద్దిపేటకు చేరుకొని శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అనంతరం సిద్దిపేట మినార్ సమీపంలోని జానుల్లా షా దర్గాలో చాదర్ సమర్పిస్తారు.

ఆ తర్వాత సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం సమీపంలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఉదయం 10 గంటలకు రంగధాంపల్లి చౌరస్తాకు చేరుకొని తెలంగాణ రక్షణ సేన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.

ఉదయం 11 గంటలకు పార్టీ ఆఫీస్ నిర్మాణ స్థలంలో మీడియాతో మాట్లాడనున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు