జయంత్ అండ్ ది జింగో పెన్, NewzFast Telugu: మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహారెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నవీన్ దేశబోయిన దర్శకత్వంలో దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించిన ఈ బాలల చిత్రాన్ని చిల్డ్రన్స్ డే ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, పిల్లల కోసం టికెట్ ధరను రూ.250 నుంచి రూ.150కి తగ్గించినట్లు తెలిపారు.
పిల్లలకు, పెద్దలకు చక్కటి సందేశాన్ని అందించేలా ఈ సినిమా ఉంటుందని, “పిల్లల మార్కులు కాదు, మనసులను చూడండి” అనే సందేశంతో ఈ చిత్రాన్ని తీశామని నిర్మాత పేర్కొన్నారు. వ్యాపార ధోరణికి కాకుండా సమాజ పరివర్తనను ఆశించి ఈ సినిమా తీసినట్లు చెప్పారు.
పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులందరూ ఈ సినిమా చూడాలని దర్శకుడు నవీన్ దేశబోయిన కోరారు.




