సందేశంతో కూడిన బాలల చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఈ నెల 14న విడుదల

జయంత్ అండ్ ది జింగో పెన్: మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, అశిష్ గాంధీ, మానస రాధకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నవీన్ దేశబోయిన దర్శకత్వం వహించగా, దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించారు. మంగళవారం ఈ చిత్రానికి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. పిల్లల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం వినోదంతో పాటు సందేశాన్ని కలబోసి ఆకట్టుకుంటుందని దర్శకుడు నవీన్ దేశబోయిన.

జయంత్ అండ్ ది జింగో పెన్, NewzFast Telugu: మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, అశిష్ గాంధీ, మానస రాధకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రానికి నవీన్ దేశబోయిన దర్శకత్వం వహించగా, దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించారు. మంగళవారం ఈ చిత్రానికి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పిల్లల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం వినోదంతో పాటు సందేశాన్ని కలబోసి ఆకట్టుకుంటుందని దర్శకుడు నవీన్ దేశబోయిన తెలిపారు. ఈ కథలోని భావోద్వేగాలు హృదయాన్ని కదిలిస్తాయని చెప్పారు.

చిల్డ్రన్స్ డే కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి పేర్కొన్నారు. పిల్లలందరూ కలిసి చూడదగ్గ మంచి చిత్రం ఇటీవల కాలంలో రాలేదని, గొప్ప సందేశంతో ఈ సినిమా రూపొందిందని నటుడు తనికెళ్ల భరణి ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు