ఉపాధి హామీ పథకం నకిలీ హాజరు వివాదం, NewzFast Telugu: ఉపాధి హామీ పథకంలో నకిలీ హాజరు నమోదు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
క్లోన్ యాప్ల ద్వారా నకిలీ హాజరు నమోదు చేస్తున్న ఉదంతాలు పదేపదే బయటపడుతున్నాయని, ఇది తీవ్రమైన అంశమని ఆయన పేర్కొన్నారు. ఇంకెన్ని రోజులు రాముడి పేరు చెప్పుకొని పాపాలు చేస్తారని ఆయన బీజేపీని ప్రశ్నించారు.
గతంలో అయోధ్యలో రాముడి పేరుతో విరాళాలు సేకరించారని, ఇప్పుడు కూడా రాముడి పేరు చెప్పుకొని పాపాలు చేస్తున్నారని జైరాం రమేశ్ మండిపడ్డారు. దేవుడి పేరుతో చేయడానికి ఇంకెంత పాపం మిగిలి ఉందని ఆయన ప్రశ్నించారు.
ఇది కేవలం అవినీతి మాత్రమే కాదని, దేవుడి పేరుతో పేద ప్రజల నమ్మకాన్ని, హక్కులను, ఉపాధిని మోసం చేయడమని ఆయన అన్నారు.

