జడ్చర్లలో లారీని ఢీకొన్న కారు, ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం

జడ్చర్ల రోడ్డు ప్రమాదం: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఒక కారు, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని త్రీ స్టార్ హోటల్ ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న కిల్జీ ప్రసాద్ (39) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందినవాడని, హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో.

జడ్చర్ల రోడ్డు ప్రమాదం, NewzFast Telugu (జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా): మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

చిత్తూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఒక కారు, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని త్రీ స్టార్ హోటల్ ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న కిల్జీ ప్రసాద్ (39) అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందినవాడని, హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. దీపావళి పండుగకు స్వగ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

కారులో ప్రయాణిస్తున్న మరో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు, కోమాలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని, గాయపడిన వ్యక్తి వివరాల కోసం అన్వేషిస్తున్నామని ఎస్సై జయప్రసాద్ తెలిపారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు