IPL trade Sunrisers Hyderabad Chennai Super Kings Khaleel Ahmed Nathan Ellis, NewzFast Telugu: ఐపీఎల్ మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ నలుగురు ఆటగాళ్లతో కూడిన ట్రేడింగ్‌ను పూర్తి చేశాయి. గురువారం ప్రకటించిన ఈ ఒప్పందం ప్రకారం సీఎస్కేకు ఆడుతున్న భారత పేసర్ ఖలీల్ అహ్మద్, ఆస్ట్రేలియా బౌలర్ నేతన్ ఎలీస్ సన్‌రైజర్స్‌కు బదిలీ అయ్యారు.
బదులుగా ఎస్ఆర్హెచ్ తమ ఆటగాళ్లు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్స్టన్, జాక్ ఎడ్వర్డ్స్‌ను చెన్నైకి ట్రేడ్ చేసింది. లివింగ్‌స్టన్‌ను రూ. 13 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ ఇప్పుడు ఆయనను రూ. 6 కోట్లకు సీఎస్కేకు ట్రేడ్ చేసింది.
ఎడ్వర్డ్స్ రూ. 3 కోట్ల ప్రస్తుత ధరతో చెన్నై జట్టులోకి చేరాడు. ఖలీల్ రూ. 4.8 కోట్ల ట్రేడ్ ఫీజుతో తిరిగి సన్‌రైజర్స్‌లోకి అడుగుపెట్టాడు.
ఎలీస్ రూ. 2 కోట్ల ధరకు సన్‌రైజర్స్ టీమ్‌లోకి వచ్చాడు.
2018 నుంచి 2021 వరకు ఆరెంజ్ ఆర్మీకి ఆడిన ఖలీల్, 2025లో చెన్నై తరఫున 15 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
