భారతీయ సారథ్యంలోని టాప్ గ్లోబల్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,410 లక్షల కోట్లకు చేరిక

భారతీయ సారథ్యంలోని గ్లోబల్ కంపెనీలు: భారతీయులు సారథ్యం వహిస్తున్న టాప్ గ్లోబల్ కంపెనీల మార్కెట్ విలువ రెండేళ్లలో 53 శాతం వృద్ధితో 15 లక్షల కోట్ల డాలర్లకు (రూ.1,410 లక్షల కోట్లు) చేరుకుంది. కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ బూమ్ ఇందుకు ప్రధాన కారణమని గురువారం విడుదలైన ‘హెచ్‌ఎస్‌బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2026’ నివేదిక వెల్లడించింది. 2024లో ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 9.9 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ జాబితాలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సారథి సుందర్.

భారతీయ సారథ్యంలోని గ్లోబల్ కంపెనీలు, NewzFast Telugu (ముంబై): భారతీయులు సారథ్యం వహిస్తున్న టాప్ గ్లోబల్ కంపెనీల మార్కెట్ విలువ రెండేళ్లలో 53 శాతం వృద్ధితో 15 లక్షల కోట్ల డాలర్లకు (రూ.1,410 లక్షల కోట్లు) చేరుకుంది. కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ బూమ్ ఇందుకు ప్రధాన కారణమని గురువారం విడుదలైన ‘హెచ్‌ఎస్‌బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2026’ నివేదిక వెల్లడించింది.

2024లో ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 9.9 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ జాబితాలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సారథి సుందర్ పిచాయ్ అగ్రస్థానంలో నిలిచారు.

ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ 4.2 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది.

మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల 2.6 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో రెండో స్థానంలో ఉన్నారు. మైక్రాన్ టెక్నాలజీకి చెందిన సంజయ్ మెహ్రోత్రా 1.4 లక్షల కోట్ల డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

జూన్ 25 నాటి మార్కెట్ విలువ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు హురున్ తెలిపింది. కనీసం 250 కోట్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగిన సంస్థలను పరిగణనలోకి తీసుకున్నారు.

భారత్ వెలుపల ప్రధాన కార్యాలయాలు కలిగిన 200 కంపెనీలను నడిపిస్తున్న 236 మంది భారత సంతతి నాయకులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 53 లక్షల మంది పనిచేస్తున్నారు. 2025లో వీటి మొత్తం ఆదాయం 2.5 లక్షల కోట్ల డాలర్లకు, మొత్తం లాభం 41,600 కోట్ల డాలర్లకు చేరుకుంది.

జాబితాలోని 200 కంపెనీల్లో 103 ఏఐ రంగానికి చెందినవి కాగా, వాటి మొత్తం విలువ 10.7 లక్షల కోట్ల డాలర్లు. ఇది మొత్తం విలువలో 71 శాతం.

ఈసారి కొత్తగా 76 కంపెనీలకు చోటు లభించింది. వాటిలో 127 పబ్లిక్ లిస్టెడ్ సంస్థలు కాగా, 73 ప్రైవేట్ కంపెనీలు. 49 స్టార్ట్‌పలు కూడా ఉన్నాయి.

జాబితాలోని సారథుల్లో 53 శాతం మంది వృత్తి నిపుణులు కాగా, 44 శాతం మంది తొలి తరం ఎంట్రప్రెన్యూర్లు. మిగిలిన మూడు శాతం మంది వారసత్వంగా వ్యాపారాన్ని అందుకున్న రెండో తరం నాయకులు. 177 మంది సారథులు అమెరికాలో ఉండగా, వారిలో మూడో వంతు మంది కాలిఫోర్నియాలో ఉన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు