ఇడుపు కాయితం, NewzFast Telugu: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ అధికారిక టీజర్ ఇటీవల విడుదలైంది. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మాత బన్నీ వాస్ వర్క్స్ పతాకంపై ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ప్రియదర్శి ఇప్పుడు హీరోగా అలరిస్తున్నారు. ‘బలగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన, ప్రస్తుతం కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నారు.
వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
టీజర్ చూస్తుంటే ఇది పూర్తిస్థాయి వినోదాత్మక, కుటుంబ కథాంశంతో రూపొందినట్లు స్పష్టమవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రియదర్శి నటన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.
టీజర్‌లోని సంభాషణలు, సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంతో తెలంగాణ జానపద పాటల ద్వారా పేరు సంపాదించిన నాగదుర్గ ప్రధాన నాయికగా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన ‘బారాత్ బీట్’ పాటలో ఆమె మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు.
సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
చిత్ర యూనిట్ ఈ సినిమాను డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టీజర్ ద్వారా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.




