Hyderabad Ranji Trophy match vs Chhattisgarh, NewzFast Telugu: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు కీలక సమయాల్లో తడబడ్డారు. బంతితో రాణించినప్పటికీ బ్యాటింగ్‌లో జట్టు ఒత్తిడికి లోనైంది.
వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ రాధేశ్ 72 పరుగులు, కొడిమెల హిమతేజ 46 పరుగులతో నిలకడగా ఆడారు. ఆఖర్లో అనికేత్ రెడ్డి 32 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 275/9తో నిలిచింది. తనయ్ త్యాగరాజన్ (29 బ్యాటింగ్), రక్షణ్ రెడ్డి (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ తరఫున ధర్మేంద్రసిన్హ్ జడేజా ఐదు వికెట్లు (5/84) తీసి హైదరాబాద్‌ను ఇబ్బంది పెట్టాడు. మిలింద్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 279/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఛత్తీస్‌గఢ్ ఐదు పరుగులు మాత్రమే జోడించి 284 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో హైదరాబాద్ ఇంకా 9 పరుగులు వెనుకబడి ఉంది.

