వసూళ్ల కేసుల్లో ఏడుగురు పోలీసులపై కఠిన చర్యలకు ఉన్నతాధికారుల నిర్ణయం

హైదరాబాద్ పోలీసు వసూళ్లు: అమాయక ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసిన పోలీసు సిబ్బందిపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత ఐదు రోజుల్లో మూడు పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎక్స్‌టార్షన్, వసూళ్ల కేసుల్లో నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులు అరెస్ట్ అయ్యారు. సైఫాబాద్, సనత్ నగర్, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సాధారణ ప్రజలను బెదిరించి నగదు వసూలు చేసిన ఘటనలు ఇందులో ఉన్నాయి. పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీసే ఈ వ్యవహారంపై ఈ ఏడుగురిపై శాఖాపరంగా.

హైదరాబాద్ పోలీసు వసూళ్లు, NewzFast Telugu (హైదరాబాద్): అమాయక ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసిన పోలీసు సిబ్బందిపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

గత ఐదు రోజుల్లో మూడు పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎక్స్‌టార్షన్, వసూళ్ల కేసుల్లో నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులు అరెస్ట్ అయ్యారు. సైఫాబాద్, సనత్ నగర్, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సాధారణ ప్రజలను బెదిరించి నగదు వసూలు చేసిన ఘటనలు ఇందులో ఉన్నాయి.

పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీసే ఈ వ్యవహారంపై ఈ ఏడుగురిపై శాఖాపరంగా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ ఘటనలపై ప్రిలిమినరీ ఎంక్వైరీకి ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.

విచారణలో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఈ ఏడుగురిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నమోదైన కేసుల్లో సాక్ష్యాధారాలు సేకరించేందుకు సమర్థవంతమైన దర్యాప్తు జరపాలని ఆయా స్టేషన్ అధికారులను పోలీస్ బాస్‌లు ఆదేశించినట్లు సమాచారం.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు