చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, పోలీస్ సిబ్బందికి హైదరాబాద్ సీపీ సజ్జనర్ సూచన

హైదరాబాద్ సీపీ సజ్జనర్: పోలీస్ సిబ్బంది చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా, మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక సృజనాత్మక అభిరుచిని అలవర్చుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమలోని నైపుణ్యాలను గుర్తించి క్రీడలు, పుస్తక పఠనం, సంగీతం, యోగా, రచనలు వంటి మంచి అభిరుచులపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం హైదరాబాద్ సిటీ పోలీస్ ఐటీ సెల్ కానిస్టేబుల్ నారాయణరావు.

హైదరాబాద్ సీపీ సజ్జనర్, NewzFast Telugu (హైదరాబాద్): పోలీస్ సిబ్బంది చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా, మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక సృజనాత్మక అభిరుచిని అలవర్చుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ తమలోని నైపుణ్యాలను గుర్తించి క్రీడలు, పుస్తక పఠనం, సంగీతం, యోగా, రచనలు వంటి మంచి అభిరుచులపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు.

బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం హైదరాబాద్ సిటీ పోలీస్ ఐటీ సెల్ కానిస్టేబుల్ నారాయణరావు కురిటి రచించిన ‘వంశధార’ వచన కవితా సంకలనాన్ని నగర సీపీ సజ్జనర్ ఆవిష్కరించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన నారాయణరావు, నిరంతరం బిజీగా ఉండే పోలీస్ ఉద్యోగంలో ఉంటూనే నాలుగేళ్ల పాటు శ్రమించి ఈ పుస్తకాన్ని తీసుకురావడం సిటీ పోలీస్‌కు గర్వకారణమని ఆయన ప్రశంసించారు.

విధులకు ఆటంకం కలగకుండా ప్రతి సిబ్బంది తమ ఖాళీ సమయాన్ని ఇలాంటి మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. పోలీస్ సిబ్బందిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా తెలిపారు.

ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లిదండ్రులు రమణ-నర్సమ్మలకు అంకితం ఇవ్వడంపై స్పందించిన సీపీ, కంటికి కనిపించే దేవుళ్లయిన తల్లిదండ్రులను గౌరవించడం, చూసుకోవడం ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యమన్నారు. పోలీసులు నిశ్చింతగా విధులు నిర్వర్తిస్తున్నారంటే ఇంట్లో ఉండి కుటుంబాన్ని చూసుకునే భార్యలు, కుటుంబ సభ్యుల సహకారమే కారణమని కొనియాడారు.

ఏఐ విస్తరిస్తున్న ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత పెరిగినా, మానవ భావోద్వేగాలను, అక్షరానికి ఉండే జీవాన్ని ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదని, పుస్తక పఠనం, రచన శాశ్వతంగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు