దీపావళి తర్వాత హైదరాబాద్‌లో గాలి నాణ్యత గణనీయంగా క్షీణత

హైదరాబాద్ గాలి కాలుష్యం: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు ఆహ్లాదకర వాతావరణానికి పేరుగాంచిన నగరంలో ప్రస్తుతం గాలి నాణ్యత ఆందోళనకర స్థాయికి పడిపోయిందని సమాచారం. దీపావళిని పురస్కరించుకుని పటాసులు పేల్చడంతో ఈ నెల 8న నగర సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 321కి చేరింది. ఈ నెల 9న రాత్రి వరకు అది 185 ఏక్యూఐకి తగ్గినట్లు నివేదికలో పేర్కొన్నారు. గాలిలోని సూక్ష్మ ధూళి కణాలైన పీఎం 2.5 స్థాయి ఈ నెల 8న 223 మైక్రోగ్రాములకు.

హైదరాబాద్ గాలి కాలుష్యం, NewzFast Telugu (హైదరాబాద్): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు ఆహ్లాదకర వాతావరణానికి పేరుగాంచిన నగరంలో ప్రస్తుతం గాలి నాణ్యత ఆందోళనకర స్థాయికి పడిపోయిందని సమాచారం.

దీపావళిని పురస్కరించుకుని పటాసులు పేల్చడంతో ఈ నెల 8న నగర సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 321కి చేరింది. ఈ నెల 9న రాత్రి వరకు అది 185 ఏక్యూఐకి తగ్గినట్లు నివేదికలో పేర్కొన్నారు.

గాలిలోని సూక్ష్మ ధూళి కణాలైన పీఎం 2.5 స్థాయి ఈ నెల 8న 223 మైక్రోగ్రాములకు చేరగా, సాధారణ పరిమితి 60 మైక్రోగ్రాములుగా ఉంది. పీఎం 10 స్థాయి 264 మైక్రోగ్రాములుగా నమోదైంది.

ఈ నెల 9న పీఎం 2.5 స్థాయి 104 మైక్రోగ్రాములు, పీఎం 10 స్థాయి 129 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాలు స్పష్టం చేశాయి.

ఈ స్థాయిలు ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అధికంగా నమోదైంది. ఈ నెల 8న ఇందిరానగర్‌లో ఏక్యూఐ 229గా, ఏపీజీఓస్ కూప్ హెచ్ఎస్జీ సొసైటీ, జనార్దన హిల్స్‌లో 224గా, కూకట్‌పల్లిలో 222గా నమోదైంది.

చిత్రపురికాలనీ, డీడీ కాలనీలో 215, ప్రకాశ్ నగర్‌లో 211, పోచమ్మ బాగ్ కాలనీలో 207, శిల్పవ్యాలీలో 206, చంచల్‌గూడలో 205, గోషామహల్‌లో 203గా గణాంకాలు చూపిస్తున్నాయి.

ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ పరిసరాలు కాలుష్య హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. పండుగ సమయంలో పటాకులు కాల్చడం, వ్యర్థాలను కాల్చడాన్ని నివారించాలని, వాహనాల వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని పేర్కొంటున్నారు.

కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలను ముమ్మరం చేసి, నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు