హంటర్ రోడ్డులో విద్యార్థుల కోసం కొత్త బస్ స్టాప్

Hunter Road new bus stop Warangal: వరంగల్ హంటర్ రోడ్డులోని బొందివాగు సమీపంలో కొత్త బస్ స్టాప్‌ను ఏర్పాటు చేశారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం మెయిన్ రోడ్ వద్ద ఈ స్టాప్‌ను ప్రారంభించారు. విద్యార్థులు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ఆర్టీసీ లక్ష్యమని హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్‌నాయక్ తెలిపారు. విశ్వవిద్యాలయానికి వచ్చే విద్యార్థులు, పరిసర ప్రాంత ప్రజలు బస్సుల కోసం ఇబ్బందులు పడకుండా ఈ స్టాప్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. జానపద గిరిజన.

Hunter Road new bus stop Warangal, NewzFast Telugu (Warangal): వరంగల్ హంటర్ రోడ్డులోని బొందివాగు సమీపంలో కొత్త బస్ స్టాప్‌ను ఏర్పాటు చేశారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం మెయిన్ రోడ్ వద్ద ఈ స్టాప్‌ను ప్రారంభించారు.

విద్యార్థులు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ఆర్టీసీ లక్ష్యమని హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్‌నాయక్ తెలిపారు. విశ్వవిద్యాలయానికి వచ్చే విద్యార్థులు, పరిసర ప్రాంత ప్రజలు బస్సుల కోసం ఇబ్బందులు పడకుండా ఈ స్టాప్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి ప్రొఫెసర్ గడ్డం వెంకన్నతో కలిసి ఆయన బస్ స్టాప్‌ను ప్రారంభించారు. ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచి ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఆర్టీసీ కృషి చేస్తోందని డీఎం పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కంట్రోలర్ చంద్రయ్య, పీఠం అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు