హస్నాపూర్ అగ్ని ప్రమాదం బాధిత కుటుంబం, NewzFast Telugu (ఉట్నూర్, తెలంగాణ): ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో కిరాణా దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఓసేవార్ దత్తకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఈ నేపథ్యంలో బుధవారం ఖానాపూర్ శాసనసభ్యులు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్న ఆయన, కాలిపోయిన దుకాణాన్ని పరిశీలించారు.
బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే, ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం ద్వారా తక్షణమే నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి జాధవ్ జగదీష్, స్థానిక సర్పంచ్ జాధవ్ విమలాబాయి, మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ జావీద్, మాజీ సర్పంచ్ జాధవ్ ఉపేందర్, మాజీ ఉప సర్పంచ్ అశోక్, నాయకులు పృథ్వీరాజ్, సుభాష్, రాందాస్, సతీష్, విష్ణు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




