హన్వాడ అక్రమ లేఔట్ తొలగింపు, NewzFast Telugu (మహబూబ్‌నగర్ జిల్లా, హన్వాడ): మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ గ్రామ శివారులోని సర్వే నంబర్ 775లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ లేఔట్‌పై అధికారులు చర్యలు చేపట్టారు. ఈ అంశంపై మంగళవారం దిశ పత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు.
బుధవారం పంచాయతీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, జేసీబీ సహాయంతో అక్రమ లేఔట్‌లో ఏర్పాటు చేసిన బౌండరీ రాళ్లు, రోడ్డు గుర్తులను తొలగించారు. గ్రామపంచాయతీ అనుమతులు లేకుండానే వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించి అమాయక ప్రజలకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరిగింది.
విచారణలో లేఔట్‌లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేకుండానే ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమతులు లేకుండా లేఔట్లు ఏర్పాటు చేసి భూముల క్రయవిక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో ఎంపీఓ జగదీష్, గ్రామ సర్పంచ్ సుధాకర్, గ్రామ పంచాయతి కార్యదర్శి దీప్తి, వార్డు సభ్యులు బత్తుల శ్రీనివాసులు, బాలకృష్ణయ్య, నెత్తి కొప్పుల నరసింహులు, బీఆర్ఎస్ నాయకుడు జి. యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
అధికారుల చర్యలపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.




