చేనేత హస్తకళలు భౌగోళిక గుర్తింపు, NewzFast Telugu (విశాఖపట్నం): రాష్ట్రంలో చేనేత, హస్తకళలు మరియు స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియో ట్యాగ్) ఇవ్వడంలో సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (విపో) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌ను కోరారు.
బుధవారం విశాఖలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఈ ఉత్పత్తుల నాణ్యత పెంపు, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ అంశాలపై కూడా చర్చ జరిగింది.
విపోతో కలిసి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఏర్పాటు చేయడం, విద్యార్థుల భాగస్వామ్యం, పరిశోధకులు, స్టార్టప్ వ్యవస్థాపకులు మరియు ఎంఎస్ఎంఈలకు మేధో సంపత్తి హక్కులు, పేటెంట్లు, ట్రేడ్ మార్క్‌లు, డిజైన్లు మరియు సాంకేతిక పరిజ్ఞాన పరిరక్షణపై శిక్షణ అవకాశాలపై కూడా చర్చించారు.
ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని విపో ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. మహిళా సాధికారతలో విపో భాగస్వామ్యం కావాలని కూడా కోరారు.
స్పందించిన డారెన్ టాంగ్, క్వాంటమ్ టెక్నాలజీని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని ప్రశంసించారు.




