జీవీ ప్రకాశ్‌కుమార్ 13 హారర్ థ్రిల్లర్ సినిమా, NewzFast Telugu: జీవీ ప్రకాశ్‌కుమార్, గౌతమ్ వాసుదేవమీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రానికి ‘13’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక ద్విభాషా చిత్రానికి వివేక్ కె దర్శకత్వం వహిస్తున్నారు.
భవ్య త్రిఖ, ఆదిత్య కతిర్, ఐశ్వర్య, అధియా ప్రసాద్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రబృందం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
దట్టమైన అటవీ నేపథ్యంలో సాగే ఈ సినిమా వాస్తవ సంఘటన స్ఫూర్తితో రూపొందుతోంది. 13 సంఖ్యకు సంబంధించిన రహస్యం, దుష్టశక్తుల బారిన పడిన వ్యక్తుల పోరాటాన్ని ఇందులో ఆవిష్కరిస్తారని దర్శకుడు వివేక్ తెలిపారు.
ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంగీతం సిద్ధు కుమార్, కెమెరా సీఎం మూవేందర్ అందిస్తున్నారు.
డిసెంబర్లో సినిమా విడుదల కానుంది.


