గురుకుల ఉద్యోగుల పెండింగ్ జీతాల కోసం సొసైటీ కార్యాలయం ముట్టడి

గురుకుల ఉద్యోగుల పెండింగ్ జీతాలు: గురుకుల సొసైటీ పరిధిలో పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సొసైటీ కార్యదర్శి కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యోగులు నిరసన తెలిపారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సొసైటీ సహాయ కార్యదర్శికి అందజేశారు. ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ, లైబ్రేరియన్లు, సీనియర్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్‌మెన్లకు.

గురుకుల ఉద్యోగుల పెండింగ్ జీతాలు, NewzFast Telugu (హైదరాబాద్): గురుకుల సొసైటీ పరిధిలో పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సొసైటీ కార్యదర్శి కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించారు.

పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యోగులు నిరసన తెలిపారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సొసైటీ సహాయ కార్యదర్శికి అందజేశారు.

ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ, లైబ్రేరియన్లు, సీనియర్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్‌మెన్లకు సత్వరమే జీతాలు చెల్లించాలని కోరారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గౌరవ వేతనం రూపంలో జీతాలు ఇవ్వడం వల్ల ఈఎస్ఐ, పీఎఫ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

గత పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న అనేక మంది పాత ఉద్యోగులకు ఇప్పటికీ ఐఎఫ్ఎంఐఎస్ ఐడీలు కేటాయించలేదని వారు తెలిపారు. సర్వీసు వివరాలు అప్‌లోడ్ చేసి ఐఎఫ్ఎంఐఎస్ నంబర్లు కేటాయించి, జీతాలు చెల్లించి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత బక్క జడ్సన్, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ పుల్లగుర్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు