గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు, NewzFast Telugu (హైదరాబాద్): ఎక్కువ మంది పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు.
ఈ మేరకు సోమవారం సీఈవో కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డికి ఆమె వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత గడువు ఈనెల 6తో ముగుస్తుందని, నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ కొనసాగే వరకు నమోదుకు అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలు జరిగిన ప్రతిసారి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియ చేపడుతుండటం పోటీ చేసే అభ్యర్థులకు భారంగా మారిందని కవిత అన్నారు. ఈ ప్రక్రియలో మార్పు తీసుకురావాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు తెలిపారు.
పెద్ద విద్యాసంస్థల యజమానులు తమ సంస్థల్లోనే భారీగా ఓటర్లను నమోదు చేయించుకుంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై సీఈవో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అలాగే, తమ తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌లో ఉందని, త్వరగా పూర్తయ్యేలా సహకరించాలని కోరినట్లు కవిత వెల్లడించారు.

