గొందిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్

గొందిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, ఆరోగ్యం, క్రీడా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. అయితే గొందిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు కనీస సౌకర్యాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సబ్బులు, కొబ్బరినూనె, దువ్వెనలు వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోవడంతో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులకు అవసరమైన.

గొందిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల, NewzFast Telugu (అశ్వాపురం): గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, ఆరోగ్యం, క్రీడా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. అయితే గొందిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు కనీస సౌకర్యాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సబ్బులు, కొబ్బరినూనె, దువ్వెనలు వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోవడంతో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులకు అవసరమైన హెయిర్ కటింగ్ సౌకర్యం కూడా కల్పించాలని ఆయన కోరారు.

మరోవైపు, విద్యార్థులు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కోసం ఆటలు ఆడేందుకు సరైన గ్రౌండ్ సౌకర్యం లేకపోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. పాఠశాల ఆటస్థలంలో నూతన భవన నిర్మాణ సామగ్రిని వేయడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారని తెలిపారు.

పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని వెంటనే ఆటస్థలంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన సంక్షేమ పథకాలు, విద్యా రాయితీలు, వసతి సదుపాయాలు, నిత్యావసర వస్తువులు సకాలంలో అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థుల సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పాఠశాలను సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు నజీర్ సోను, బీసీ సెల్ యువజన నాయకుడు అరసవల్లి పవన్, బీఆర్ఎస్ యువజన నాయకుడు చిచ్చోడి లక్ష్మణ్, గొందిగూడెం ఐదవ వార్డు మెంబర్ బండ్ల సాయి తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు