బంగారం ధరలు, NewzFast Telugu (న్యూఢిల్లీ): దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాలకు డిమాండ్ తగ్గడంతో బంగారం ధరలు శాంతించాయి. దీపావళి నుంచి తగ్గుతూ వచ్చిన పుత్తడి గురువారం ఒక్కరోజే రూ.2 వేలకు పైగా తగ్గింది.
న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.2,200 తగ్గి రూ.1,43,400కు దిగివచ్చింది. అంతకుముందు ఇది రూ.1,45,600గా ఉంది.
కొనుగోళ్లపై ఆసక్తి తగ్గడం, అంతర్జాతీయంగా ధరలు తగ్గడం బంగారంపై ఒత్తిడిని మరింత పెంచిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
పసిడి ధరలు భారీగా పడిపోయినప్పటికీ వెండి ధర మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1,87,500 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరగడంతో ఔన్స్ గోల్డ్ ధర 39.93 డాలర్లు లేదా ఒక శాతం తగ్గి 3,950 డాలర్లకు పడిపోయింది. వెండి 1.17 శాతం తగ్గి 51 డాలర్ల వద్ద ఉంది.




