ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.2,200 తగ్గింపు

బంగారం ధరలు: బంగారం ధరలు శాంతించాయి. దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో ధరలు దిగొస్తున్నాయి. దీపావళి నుంచి తగ్గుతూ వచ్చిన పుత్తడి గురువారం ఏకంగా రూ.2 వేలకు పైగా తగ్గింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల గోల్డ్ ధర రూ.2,200 తగ్గి రూ.1,43,400కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.1,45,600గా ఉన్నది. కొనుగోళ్లపై ఆసక్తి తగ్గడం, అంతర్జాతీయంగా ధరలు తగ్గడం బంగారంపై ఒత్తిడిని మరింత పెంచిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్.

బంగారం ధరలు, NewzFast Telugu (న్యూఢిల్లీ): బంగారం ధరలు శాంతించాయి. దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో ధరలు దిగొస్తున్నాయి.

దీపావళి నుంచి తగ్గుతూ వచ్చిన పుత్తడి గురువారం ఏకంగా రూ.2 వేలకు పైగా తగ్గింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల గోల్డ్ ధర రూ.2,200 తగ్గి రూ.1,43,400కి దిగొచ్చింది.

అంతకుముందు ఇది రూ.1,45,600గా ఉన్నది.

కొనుగోళ్లపై ఆసక్తి తగ్గడం, అంతర్జాతీయంగా ధరలు తగ్గడం బంగారంపై ఒత్తిడిని మరింత పెంచిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. పసిడి ధరలు భారీగా పడిపోయినప్పటికీ వెండి మాత్రం యథాతథంగా కొనసాగుతున్నది.

కిలో వెండి ధర రూ.1,87,500 వద్ద ఉన్నది.

అనూహ్యంగా డాలర్‌కు డిమాండ్ నెలకొనడంతో గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 39.93 డాలర్లు లేదా ఒక్క శాతం తగ్గి 3,950 డాలర్లకు పడిపోయింది. అలాగే వెండి 1.17 శాతం తగ్గి 51 డాలర్ల వద్ద ఉన్నది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు