ఫ్యూచర్‌ సిటీ పనులు వేగం.. గ్లోబల్‌ సమ్మిట్‌ నాటికి రతన్‌ టాటా రోడ్డు సిద్ధం

ఫ్యూచర్‌ సిటీ: హైదరాబాద్‌ దక్షిణ భాగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్లోబల్‌ సిటీ నిర్మించేందుకు ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ (ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌) తరహాలోనే ఫోర్త్‌ సిటీని నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబరులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఫ్యూచర్‌ సిటీ పరిధిలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రోడ్‌ నెట్‌వర్క్‌ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యూచర్‌ సిటీ మీదుగా ఆధునిక ఎక్స్‌ప్రెస్‌ వేను.

ఫ్యూచర్‌ సిటీ, NewzFast Telugu (రంగారెడ్డి అర్బన్‌): హైదరాబాద్‌ దక్షిణ భాగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్లోబల్‌ సిటీ నిర్మించేందుకు ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ (ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌) తరహాలోనే ఫోర్త్‌ సిటీని నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.

డిసెంబరులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఫ్యూచర్‌ సిటీ పరిధిలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు.

ముఖ్యంగా రోడ్‌ నెట్‌వర్క్‌ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఫ్యూచర్‌ సిటీ మీదుగా ఆధునిక ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రభుత్వం నిర్మిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రతన్‌ టాటా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టింది.

ఈ రోడ్డును ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌-13 నుంచి గ్లోబల్‌ సమ్మిట్‌ వేదిక వరకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి.

రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.4,621 కోట్ల అంచనా వేసి పనులు ప్రారంభించింది. పలుచోట్ల రైతులు రోడ్డు నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అధికారులు పేర్కొన్నారు.

రిత్విక్‌ ప్రాజెక్టు సంస్థ ఈ కాంట్రాక్టు పనులను దక్కించుకుంది.

డిసెంబరులో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌కు దేశ, విదేశాల పారిశ్రామికవేత్తల వాహనాలు ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-13 నుంచి నేరుగా స్కిల్‌ యూనివర్సిటీ వరకు చేరేలా పనులను వేగవంతం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎఫ్‌సీడీఏ అధికారులు డ్రోన్‌ సర్వే ద్వారా భౌగోళిక డేటాను సేకరిస్తున్నారు.

యాచారం, ఆమన్‌గల్‌, మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్‌ మండలాల పరిధిలోని 71 గ్రామాల్లో భవిష్యత్‌ ప్రాజెక్టుల కోసం వనరులపై నివేదికలు సిద్ధం చేయనున్నారు.

ఫ్యూచర్‌ సిటీలోని పారిశ్రామిక, ఐటీ, నివాస ప్రాంతాలను సిగ్నల్స్‌ రహిత జంక్షన్లతో జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బెంగళూరు జాతీయ రహదారి-844, శ్రీశైలం జాతీయ రహదారి-765 నుంచి నాగార్జునసాగర్‌ రహదారికి అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కీలక లింక్‌ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.

ఇందుకోసం ఎఫ్‌సీడీఏ పరిధిలోని లింక్‌ రోడ్ల విస్తరణ, కల్వర్టుల విస్తరణకు రూ.140 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు