నిరుపయోగంగా పడి ఉన్న మత్స్యశాఖ ప్రచార బోర్డులు

మత్స్యశాఖ ప్రచార బోర్డులు: ప్రభుత్వ పథకాలు, మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేయాల్సిన మత్స్యశాఖ ప్రచార బోర్డులు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. సూర్యాపేట మండల పరిధిలోని కేసారం గ్రామ రైతు వేదిక ముందు ఎలాంటి ఉపయోగం లేకుండా నెలల తరబడి పడి ఉండటంతో స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని వెచ్చించి తయారు చేయించిన ఈ బోర్డులను సంబంధిత గ్రామాల్లోని చెరువులు, కుంటల వద్ద లేదా ప్రజలకు కనిపించే ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాల్సి ఉంది.

మత్స్యశాఖ ప్రచార బోర్డులు, NewzFast Telugu (సూర్యాపేట రూరల్): ప్రభుత్వ పథకాలు, మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేయాల్సిన మత్స్యశాఖ ప్రచార బోర్డులు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. సూర్యాపేట మండల పరిధిలోని కేసారం గ్రామ రైతు వేదిక ముందు ఎలాంటి ఉపయోగం లేకుండా నెలల తరబడి పడి ఉండటంతో స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాధనాన్ని వెచ్చించి తయారు చేయించిన ఈ బోర్డులను సంబంధిత గ్రామాల్లోని చెరువులు, కుంటల వద్ద లేదా ప్రజలకు కనిపించే ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అందుకు విరుద్ధంగా రైతు వేదిక ఆవరణలో ఒక మూలన పడేయడంతో అవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పట్టి పాడైపోయే పరిస్థితి నెలకొంది.

లక్షలాది రూపాయల ప్రజాధనంతో రూపొందించిన సామగ్రిని ఇలా గాలికి వదిలేయడం పట్ల మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మత్స్యశాఖ అధికారులు స్పందించి, నిరుపయోగంగా పడి ఉన్న బోర్డులను తక్షణమే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసి సద్వినియోగం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు