తొలి మహిళా సహస్రావధానం, NewzFast Telugu (విజయవాడ): తెలుగు సాహిత్యంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. విజయవాడలో తొలి మహిళా సహస్రావధానం జరగనుంది.
ఈ కార్యక్రమం డిసెంబర్ 10 నుండి జనవరి 3 వరకు 25 రోజుల పాటు కొనసాగుతుంది. మహిళా అవధాని బులుసు అపర్ణా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం మహిళా అవధానానికి సంబంధించిన తొలి సహస్రావధానంగా నిలవడం విశేషం.
ఈ కార్యక్రమానికి పోటీ శ్రీ రాములు ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం వేదికగా నిలుస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ విజయవాడలోని కేబీఎన్ కాలేజీలో నిర్వహించారు.
హిందూ హై స్కూల్స్ కమిటీ జనరల్ కరస్పాండెంట్ గోపిశెట్టి మల్లయ్య ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 10న బ్రహ్మ మడుగుల నాగఫణేశ్వరమూర్తి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ సహస్రావధాన ప్రక్రియ 25 రోజుల పాటు వివిధ దశల్లో కొనసాగుతుంది.
బులుసు అపర్ణా మాట్లాడుతూ, తాను 325కు పైగా అష్టావధానాలు, 7 శతావధానాలు, 2 ద్విశతావధానాలు పూర్తి చేసినట్లు తెలిపారు. గురువుల ఆశీర్వాదంతో ఈ సహస్రావధానానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
డిసెంబర్ 10 నుండి 22 వరకు ఆమె అంశాలు, థీమ్స్ స్వీకరించనున్నారు.




