యూరప్ సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి, NewzFast Telugu: యూరప్‌లో హ్యాకర్లు సరికొత్త తరహా సైబర్ దాడికి పాల్పడ్డారు. ఏడు దేశాల్లోని సూపర్ మార్కెట్ల రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను అమాంతం 70 డిగ్రీలకు పెంచినట్లు సమాచారం.
దీంతో వాటిలో నిల్వ ఉంచిన పాలు, మాంసం, ఇతర ఆహార పదార్థాలు పాడైపోయాయి. లక్షల యూరోల విలువైన సరుకులను నిర్వాహకులు చెత్తలో పడేయాల్సి వచ్చింది.
బెల్జియం, స్వీడన్, నెదర్లాండ్స్, ఎస్టోనియా, లగ్జెంబర్గ్, ఫిన్లాండ్, ఐర్లాండ్ దేశాల్లో ఈ దాడులు జరిగినట్లు వెల్లడైంది. స్వీడన్‌కు చెందిన ఐసీఏ, కూప్ సూపర్ మార్కెట్ల దుకాణాలు ప్రభావితమయ్యాయి.
కూప్‌కు చెందిన ఆరు స్టోర్లలో సమస్యలు తలెత్తగా, కొన్ని చోట్ల ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు చేరినట్లు సమాచారం. బెల్జియంలో డల్హైజ్, కార్పోస్, స్పార్ దుకాణాల్లోనూ రిఫ్రిజిరేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి.
బెల్జియం సంస్థ సబ్‌కోబెల్ సీఈవో స్టీఫాన్ మోలెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం, హ్యాకర్లు ఫ్రిజ్‌ల కూలింగ్ యూనిట్లను డీఫ్రాస్ట్ మోడ్‌లోకి మార్చారు. ఈ సమయంలో శీతలీకరణ నిలిచిపోవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి.
ఈ సమస్యలను కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో పరిష్కరించడం సాధ్యం కాదని, వ్యవస్థల్లోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

