ఎర్రుపాలెంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఎర్రుపాలెం రోడ్డు ప్రమాదం: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని వైన్‌షాప్‌ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో విజయవాడ నుండి భీమవరం గ్రామానికి వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్‌లో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా రాత్రి 10.30 గంటల సమయంలో మృతి.

ఎర్రుపాలెం రోడ్డు ప్రమాదం, NewzFast Telugu (ఎర్రుపాలెం, ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని వైన్‌షాప్‌ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో విజయవాడ నుండి భీమవరం గ్రామానికి వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్‌లో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా రాత్రి 10.30 గంటల సమయంలో మృతి చెందాడు.

మృతుడి వయస్సు సుమారు 50 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. చామనఛాయ రంగు, నలుపు రంగు నిండు చేతుల చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు వెల్లడించారు.

కొద్దిగా బట్టతలతో పాటు నలుపు, తెలుపు వెంట్రుకలు, గడ్డం ఉన్నట్లు తెలిపారు.

కుడి భుజం, కుడి మోకాలిపై పుట్టుమచ్చలు ఉన్నాయని, ఛాతీ భాగంలో గతంలో శస్త్ర చికిత్స జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని వివరించారు. మృతుడిని గుర్తించిన వారు లేదా అతడి కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసినవారు వెంటనే ఎర్రుపాలెం ఎస్‌ఐ రమేష్‌కుమార్‌ సెల్‌ నంబర్‌ 8712659164 లేదా ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌ నంబర్‌ 8712659165కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు