ఈఎన్‌ఈ రిపీట్, NewzFast Telugu: ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకులకు ఎంతో చేరువైన మిత్రబృందం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ఈఎన్‌ఈ రిపీట్’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తరుణ్‌భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్‌సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల మంగళవారం ఈ సినిమా నుంచి ‘మిత్వా’ అనే పాటను విడుదల చేశారు.
‘చిరుగాలే చేరే నీలాకాశమే.. చినుకల్లే జారే సాగే మేఘమే’ అంటూ సాగే ఈ పాట స్నేహబంధంలోని అందమైన అనుభూతులకు అద్దం పడుతోంది.
వివేక్‌సాగర్ స్వరపరచిన ఈ పాటకు భరద్వాజ్ గాలి సాహిత్యం అందించారు. నకుల్ అభ్యంకర్, వీణా ఘంటశాల ఆలపించారు.
థాయ్‌లాండ్ విహార యాత్రలో మిత్రబృందం చేసే హంగామా, సరదాగా గడిపిన క్షణాలను ఈ పాట ఆవిష్కరిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం వివేక్‌సాగర్, నిర్మాతలు సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి, రచన-దర్శకత్వం తరుణ్‌భాస్కర్.




