ఎన్నికల పెండింగ్ బిల్లుల విడుదల, NewzFast Telugu: రాష్ట్రంలో నిర్వహించిన వివిధ ఎన్నికలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని (సీఈవో) కోరింది.
2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ మరియు సహాయ రిటర్నింగ్ అధికారులు చేసిన వ్యయాలు కేటాయించిన బడ్జెట్‌ను మించిపోయాయని సంఘం గుర్తు చేసింది. ఎన్నికల నిర్వహణకు అదనపు బడ్జెట్ మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు ఎన్నికల పెండింగ్ మరియు అదనపు బిల్లులను మంజూరు చేయాలని కోరుతూ గురువారం సీఈవో సుదర్శన్‌రెడ్డిని సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ఇతర ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం నాయకులు శకుంతల, లావణ్య, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక, మహిళా అధ్యక్షురాలు రాధ, శ్రీకాంత్, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
