డ్రంక్ అండ్ డ్రైవ్, NewzFast Telugu (మేడ్చల్, తెలంగాణ): మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 8 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితులను మేడ్చల్‌లోని జూనియర్ సివిల్ జడ్జి-కమ్-VII అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
విచారణ అనంతరం న్యాయస్థానం కఠిన తీర్పును వెలువరించింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆరుగురికి మొత్తం రూ.4,500 జరిమానా విధించడంతో పాటు, తీవ్రతను బట్టి ఐదుగురికి జైలు శిక్ష ఖరారు చేసింది.
ఇందులో ఒకరికి 10 రోజుల జైలు శిక్ష, మరో నలుగురికి 4 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు రూ.2,000 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ప్రతి వాహనదారుడు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు.




