డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర: వరంగల్ సీపీ శ్వేత

డ్రగ్స్ రహిత సమాజం: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ పిలుపునిచ్చారు. కాకతీయ వైద్య కళాశాల (కేఎమ్‌సీ) వార్షికోత్సవ వేడుకలు ‘ఉత్కర్ష్-2026’లో భాగంగా ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ కింద అవగాహన కల్పించేందుకు బుధవారం కేఎమ్‌సీ విద్యార్థులు హెల్త్ రన్, హెల్త్ వాక్ నిర్వహించారు. ఉదయం 6:30 గంటలకు కేఎమ్‌సీ నుంచి హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు సాగిన ఈ కార్యక్రమానికి సీపీ శ్వేత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డ్రగ్స్.

డ్రగ్స్ రహిత సమాజం, NewzFast Telugu (వరంగల్): డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ పిలుపునిచ్చారు.

కాకతీయ వైద్య కళాశాల (కేఎమ్‌సీ) వార్షికోత్సవ వేడుకలు ‘ఉత్కర్ష్-2026’లో భాగంగా ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ కింద అవగాహన కల్పించేందుకు బుధవారం కేఎమ్‌సీ విద్యార్థులు హెల్త్ రన్, హెల్త్ వాక్ నిర్వహించారు. ఉదయం 6:30 గంటలకు కేఎమ్‌సీ నుంచి హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు సాగిన ఈ కార్యక్రమానికి సీపీ శ్వేత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజంలో విరివిగా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలన ఒక్క పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, అందరూ భాగస్వాములు కావాలని అన్నారు.

అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.

మార్గమధ్యలోని సీపీఓ జంక్షన్‌లో విద్యార్థులు నాటక, నృత్య ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. పరేడ్ గ్రౌండ్‌లో ‘Say No to Drugs’ నినాదంతో భారీ మానవహారం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, ఇన్‌చార్జి ఏసీపీ నరసింహారావు, ప్రిన్సిపల్ డాక్టర్ డి. మోహన్ దాస్, వివిధ శాఖల అధికారులు, సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు