DNK సినిమా, NewzFast Telugu (హైదరాబాద్): ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘DNK’ శుక్రవారం విడుదల కానుంది. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకత్వం వహించగా, సుస్మితశెట్టి కథానాయికగా నటించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రముఖ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
హీరో మౌళి మాట్లాడుతూ, ఇది చాలా వినోదాత్మకమైన సబ్జెక్ట్ అని తెలిపారు. అందరూ హాయిగా నవ్వుకునేలా దర్శకుడు శ్రీను కంబాల ఈ సినిమాను తెరకెక్కించారని, టీమ్ అంతా మనసుపెట్టి పనిచేసిందని చెప్పారు.
సినిమా అద్భుతంగా వచ్చిందని, అందరికీ నచ్చుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రతిష్టాత్మక మైత్రీ సంస్థ ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉందని శ్రీను కంబాల అన్నారు. ఆద్యంతం వినోదాన్ని పంచే సినిమా ఇదని, జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమాను తీశానని చెప్పారు.
ఇది తప్పక విజయం సాధించే సినిమా అని నిర్మాత రవిశంకర్ నమ్మకంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు దర్శకులు బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ, శివనిర్వాణ, సాయిమార్తాండ్, నిర్మాత ఎస్కేఎన్ కూడా ప్రసంగించారు.




