దీపావళి బాణాసంచా విక్రయ లైసెన్సులు, NewzFast Telugu (హైదరాబాద్): దీపావళి పండగ సందర్భంగా రాష్ట్రంలో బాణాసంచా విక్రయానికి 7,601 దుకాణాలకు లైసెన్సులు జారీ చేసినట్లు అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు.
సురక్షితంగా దీపావళి నిర్వహణ ఏర్పాట్లపై ఆయన జిల్లాల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పండగ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా విక్రయించినా, నిల్వ చేసినట్లు గుర్తించినా అటువంటి వారిపై చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తల్లిదండ్రులు, పెద్దల పర్యవేక్షణలో చిన్న పిల్లలు మాత్రమే టపాసులు కాల్చాలని ఆయన సూచించారు.
