దిల్ రాజు దీపావళి వేడుకలు, NewzFast Telugu (తెలంగాణ): దేశవ్యాప్తంగా దీపావళి పండుగ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు సామాన్య ప్రజల వరకు అందరూ ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో కూడా దీపావళి వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
తన భార్య, కుమారుడితో కలిసి దిల్ రాజు దీపావళిని గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆయన భార్య తేజస్విని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.
ఫొటోల్లో దిల్ రాజు కుటుంబం సంప్రదాయ దుస్తుల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. భార్య తేజస్విని, కుమారుడు అన్వి రెడ్డి కూడా అందంగా కనిపించారు.
వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగానే కాకుండా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఇతర భాషా చిత్రాలను కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసిన రామాయణ చిత్రం బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోంది.
ప్రస్తుతం దిల్ రాజు రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. వాటిలో ఒకటి బలగం వేణు తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ, ఇందులో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన అనే చిత్రాన్ని కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది.




