ప్రతి చుక్క నీటికీ లెక్క: కృత్స్నం ‘ధారా’ స్మార్ట్ వాటర్ మీటర్‌తో అపార్ట్‌మెంట్‌లలో నీటి వృథాకు చెక్

ధారా స్మార్ట్ వాటర్ మీటర్: ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్ నగరంలో శీతాకాలానికే నీటి ఎద్దడి మొదలైంది. ప్రభుత్వ నీటి సరఫరా లెక్కలు కూడా మారిపోయాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లలో నీటిని వృథా చేయొద్దంటూ బోర్డులు వెలుస్తున్నాయి. బోరుబావులు అడుగంటిపోతుండటంతో అపార్ట్‌మెంట్లలో నీటి వినియోగంపై వివాదాలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి నీటిబొట్టుకు పక్కాగా లెక్కలు తేలుస్తామంటూ కృత్స్నం సంస్థ ముందుకొచ్చింది. ఇందుకోసం అల్ట్రాసోనిక్ స్మార్ట్ వాటర్ మీటర్‌ను తెరపైకి తెచ్చింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 8.4 లక్షల.

ధారా స్మార్ట్ వాటర్ మీటర్, NewzFast Telugu (హైదరాబాద్): ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్ నగరంలో శీతాకాలానికే నీటి ఎద్దడి మొదలైంది. ప్రభుత్వ నీటి సరఫరా లెక్కలు కూడా మారిపోయాయి.

దీంతో అపార్ట్‌మెంట్‌లలో నీటిని వృథా చేయొద్దంటూ బోర్డులు వెలుస్తున్నాయి.

బోరుబావులు అడుగంటిపోతుండటంతో అపార్ట్‌మెంట్లలో నీటి వినియోగంపై వివాదాలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి నీటిబొట్టుకు పక్కాగా లెక్కలు తేలుస్తామంటూ కృత్స్నం సంస్థ ముందుకొచ్చింది.

ఇందుకోసం అల్ట్రాసోనిక్ స్మార్ట్ వాటర్ మీటర్‌ను తెరపైకి తెచ్చింది.

ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 8.4 లక్షల ట్యాంకర్లు బుక్ అయ్యాయి. ఇందుకు నగరవాసులు ఇప్పటివరకు రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేశారని అంచనా.

వ్యాపారంలో ప్రతి రూపాయికీ లెక్క ఉన్నట్లే, నీటి వినియోగానికీ లెక్క ఉండాలనే ఆలోచనతో ఐఐటీ కాన్పూర్‌లో ఈ స్టార్టప్ ప్రారంభమైంది.

ప్రస్తుతం ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా సొంతంగా స్మార్ట్ వాటర్ మీటర్లను తయారు చేస్తోంది. సంస్థ వ్యవస్థాపకులు శ్రీహర్ష, వినయ్ చాటరాజు, పృథ్వీ సాగర్ అనగాని, నీరజ్ కుమార్ రాయ్ ‘ధారా’ ప్లాట్‌ఫామ్ ద్వారా నివాస సముదాయాలు, పరిశ్రమల్లో నీటి వాడకంపై స్పష్టమైన డేటాను అందిస్తున్నారు.

ప్రతి రోజు ఉదయం, ముందు రోజు ఏ ఫ్లాట్ ఎంత నీరు వాడిందో ‘ధారా పల్స్’ ద్వారా నేరుగా వాట్సాప్‌లోనే వివరాలు అందుతాయి. ఈ అల్ట్రాసోనిక్ మీటర్లు ప్రతి గంటకు నీటి ప్రవాహాన్ని లెక్కిస్తాయి.

ఫ్లష్‌లు లేదా ట్యాప్‌ల నుంచి చుక్కలుగా కారే నీటిని కూడా గుర్తించి, ఎక్కడ వృథా జరుగుతుందో కచ్చితంగా పసిగడతాయి.

ఈ మీటర్ 4జీ సిమ్‌తో పనిచేస్తుంది. దీని బ్యాటరీ ఐదేళ్లపాటు పనిచేస్తుందని సంస్థ తెలిపింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా మీటర్లను బిగించినట్లు సంస్థ పేర్కొంది. దీనివల్ల అపార్ట్‌మెంట్ల నిర్వహణ భారం కొంతమేరకైనా తగ్గుతుందని భావిస్తున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు