ఢిల్లీ చావ్రి బజార్ భవనం కూలిపోవడం, NewzFast Telugu (ఢిల్లీ): ఓల్డ్ ఢిల్లీలోని చావ్రి బజార్లో ఉన్న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, కొందరు గాయపడ్డారు.
చావ్రి బజార్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఈ భవనం శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతానికి ఆరు అగ్నిమాపక దళాలు చేరుకున్నాయి.
వాటర్ టెండర్లు, రెస్క్యూ వాహనాలు రంగంలోకి దిగగా, సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శిథిలాల తొలగింపు, బాధితుల గుర్తింపు పనులు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 6న ఢిల్లీలోని సత్యా నికేతన్‌లో ఐదు అంతస్తుల పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందిన విషయం గుర్తుండే ఉంటుంది.

