Darius Khambata Tata Trusts exit, NewzFast Telugu: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ బోర్డు ప్రవర్తనను తీవ్రంగా తప్పుబడుతూ, సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌ల నామినేటెడ్ ట్రస్టీ డారియస్ ఖంబటా రాసిన లేఖ కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సెప్టెంబర్ 17న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఎన్ చంద్రశేఖరన్‌ను తిరిగి చైర్మన్‌గా నియమించడం, కంపెనీని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసేందుకు ఓటు వేయడంపై ఖంబటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, సీఈఓ సిద్ధార్థ్ శర్మలకు రాసిన లేఖలో, రతన్ టాటా జీవించి ఉంటే బోర్డు ఇలా వ్యవహరించి ఉండేదా అని ప్రశ్నించారు.
ఆయన సెప్టెంబర్ 17ను టాటా సన్స్ ప్రతిష్టను మసకబార్చిన ‘అపఖ్యాతి దినం’గా అభివర్ణించారు. ఆ సమావేశంలో నోయెల్ టాటా మాత్రమే ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓటు వేయగా, ఖంబటా స్వయంగా ట్రస్టీ పదవికి రాజీనామా చేసినట్లు నివేదిక పేర్కొంది.
ఈ వివాదానికి ప్రధాన కారణం టాటా సన్స్ ఐపీఓ వ్యవహారమే. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అప్పర్-లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా ఉన్న టాటా సన్స్ లిస్ట్ కావాల్సి ఉండగా, డీ-రిజిస్ట్రేషన్ కోరిన విజ్ఞప్తిని ఆర్‌బీఐ తిరస్కరించింది.
దీంతో లిస్టింగ్‌కు బోర్డు మొగ్గు చూపగా, టాటా ట్రస్ట్స్‌లోని ప్రధాన వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.


