108 102 అంబులెన్స్ తనిఖీ, NewzFast Telugu (దండేపల్లి): దండేపల్లి మండల కేంద్రంలోని 108, 102 అంబులెన్స్ వాహనాలను గురువారం జిల్లా మేనేజర్ కొండలరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అంబులెన్స్ వాహనాల స్థితిగతులు, నిర్వహణ, అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు మరియు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల్లోని వైద్య పరికరాల పనితీరుపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఆలస్యం చేయకుండా సమీప ఆసుపత్రులకు త్వరితగతిన తరలించి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలన్నారు.
వాహనాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడంతో పాటు వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీలో 108 అంబులెన్స్ సిబ్బంది పైలెట్లు మహేందర్, శ్రీనివాస్, ఈఎంటీలు నరసయ్య, జనార్దన్, కిషన్, 102 కెప్టెన్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.




