తుఫాన్ నష్టం అంచనాలను సమగ్రంగా తయారు చేయాలి: మంత్రి రవికుమార్

తుఫాన్ నష్టం అంచనాలు: తుఫాన్ నష్టం అంచనాలను సమగ్రంగా తయారు చేయాలని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల విద్యుత్, వ్యవసాయ అధికారులతో పాటు నియోజకవర్గ ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులతో బుధవారం సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం వద్ద క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌తో నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దెబ్బతిన్న వరి, పత్తి.

తుఫాన్ నష్టం అంచనాలు, NewzFast Telugu (సంతమాగులూరు, ప్రకాశం జిల్లా): తుఫాన్ నష్టం అంచనాలను సమగ్రంగా తయారు చేయాలని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల విద్యుత్, వ్యవసాయ అధికారులతో పాటు నియోజకవర్గ ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులతో బుధవారం సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం వద్ద క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.

తుఫాన్‌తో నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

దెబ్బతిన్న వరి, పత్తి, మిరప, మినుము, శనగ, పొగాకు తదితర పంటల నష్టాన్ని గుర్తించి, దెబ్బతిన్న విస్తీర్ణం, నష్టపోయిన రైతుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని చెప్పారు.

విద్యుత్ పునరుద్ధరణ పనులు అత్యధిక శాతం పూర్తయినందున, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్ లైన్‌ల మరమ్మతులను మరింత వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. దెబ్బతిన్న ప్రధాన రోడ్లతో పాటు గ్రామీణ రోడ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులను కూడా ఆదేశించారు.

ఈ సమీక్షలో ప్రకాశం, బాపట్ల జిల్లాల వ్యవసాయాధికారులు, జిల్లా హార్టికల్చర్ అధికారులు, మండల వ్యవసాయశాఖ అధికారులు, విద్యుత్ ఎస్‌ఈలు, ఈఈ, డీఈలు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు