కొకైన్ అక్రమ రవాణా కేసులో ఆస్తుల జప్తు, NewzFast Telugu (హైదరాబాద్): మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నారొటిక్స్ పోలీసులు, ఈగల్ బృందం సంయుక్తంగా సుమారు రూ.2 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2025లో జరిగిన కొకైన్ అక్రమ రవాణా వ్యవహారంలో శ్రీరామ్ అనంత్‌కుమార్, పేరూరు వీరబాబును నిందితులుగా గుర్తించారు. వారి నుంచి 107.4 గ్రాముల కొకైన్‌తో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోలీసులు వారి వెనుక ఉన్న నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలు, కూడబెట్టిన ఆస్తులపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. శ్రీరామ్ అనంత్‌కుమార్, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన రెండు బ్యాంకు ఖాతాల్లోని మొత్తం రూ.43,655ను ఫ్రీజ్ చేశారు.
నిందితుడి బంధువుల పేర్లపై ఉన్న రెండు నివాస ఫ్లాట్లను కూడా గుర్తించారు. ఈ ఆస్తుల జప్తు మంగళవారం జరిగినట్లు సమాచారం.

