చిన్నారుల్లో న్యుమోనియా మరణాలు తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ‘సాన్స్‌’ ప్రచారం ప్రారంభం

చిన్నారుల్లో న్యుమోనియా మరణాలు: ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ‘సాన్స్‌ 2026-27’ (సోషల్‌ ఎవేర్‌నెస్‌, యాక్షన్‌ టు న్యూట్రలైజ్‌ న్యుమోనియా సక్సెస్‌ఫుల్లీ) ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్యశాఖ కమిషనర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు బుధవారం తెలిపారు. గురువారం మొదలయ్యే ఈ కార్యక్రమం 2027 ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 17.2 శాతం మరణాలు న్యుమోనియా కారణంగానే సంభవిస్తున్న నేపథ్యంలో, ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ.

చిన్నారుల్లో న్యుమోనియా మరణాలు, NewzFast Telugu (అమరావతి): ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ‘సాన్స్‌ 2026-27’ (సోషల్‌ ఎవేర్‌నెస్‌, యాక్షన్‌ టు న్యూట్రలైజ్‌ న్యుమోనియా సక్సెస్‌ఫుల్లీ) ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్యశాఖ కమిషనర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు బుధవారం తెలిపారు.

గురువారం మొదలయ్యే ఈ కార్యక్రమం 2027 ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 17.2 శాతం మరణాలు న్యుమోనియా కారణంగానే సంభవిస్తున్న నేపథ్యంలో, ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

వైద్యాధికారులు, స్టాఫ్‌ నర్సులు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు న్యుమోనియా గుర్తింపు, చికిత్సపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చిన్నారుల్లో వ్యాధి లక్షణాలను గుర్తించి, బాధితులకు తక్షణ వైద్య సేవలు అందేలా చూస్తారని చెప్పారు.

ఐదేళ్లలోపు చిన్నారుల్లో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో విజయవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఇదిలావుంటే, గుండెపోటు, పక్షవాతం బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధులను సమర్థంగా నియంత్రించాలని కూడా చక్రధర్‌బాబు అధికారులకు సూచించారు. ఇందుకోసం మంగళగిరిలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించగా, వ్యాధులను ముందుగానే గుర్తించడం, సమగ్ర చికిత్స అందించడంపై అధికారులు, వైద్యులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్థన్‌, డీహెచ్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

నవజాత శిశువులకు అందించే వైద్య సేవల నాణ్యతను పెంచి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆరోగ్యశాఖ ఎఫ్‌బీఎన్‌సీ (ఆసుపత్రి ఆధారిత నవజాత శిశు సంరక్షణ) పోర్టల్‌ను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా చినకాకాని హాయ్‌లాండ్‌ హోటల్‌లో రెండు రోజుల పాటు పోర్టల్‌ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను సకాలంలో నమోదు చేయడం, విశ్లేషించడం, పర్యవేక్షించడంలో సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడం ఈ శిక్షణ లక్ష్యమని ఆయన వివరించారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు