చెంచు గ్రామాల్లో వీబీ-జీ రామ్ జీ పథకం ఉపాధి, NewzFast Telugu: రాష్ట్రంలోని చెంచు గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం కింద 125 రోజుల ఉపాధి కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు.
దీంతోపాటు ‘జలసిరి’ కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ పనులు చేపట్టి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచుతున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇప్పటికే ఆమోదం పొందిన పనులను సమన్వయంతో వేగంగా ప్రారంభించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
